Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోదీ సర్కారు చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోరు: వినోద్

విద్యుత్ ప్లాంట్‌ను లాగేసుకోవడంతో ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని.. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. నరేంద్ర మోదీ సర్కారు చేసిన ఈ మోసాన

మోదీ సర్కారు చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోరు: వినోద్
, శుక్రవారం, 20 జులై 2018 (16:34 IST)
విద్యుత్ ప్లాంట్‌ను లాగేసుకోవడంతో ఛత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని.. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. నరేంద్ర మోదీ సర్కారు చేసిన ఈ మోసాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోరన్న వినోద్.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపైనే అవిశ్వాసమని చెప్పారు. 
 
కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంట్ సమావేశంలో వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డుగా మారుతోందని, అనవసరంగా కేసులు వేస్తోందన్నారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ రావాల్సిందిగా చట్టంలో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆ దిశగా చర్చ జరగలేదన్నారు. 
 
తెలంగాణ గురించి కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదన్న వినోద్.. హైకోర్టు విభజన ఇప్పటికీ జరగకపోవడమే ఇందుకు నిదర్శనమని వినోద్ వ్యాఖ్యానించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చట్టంలో క్లియర్‌గా ఉన్నప్పటికీ.. ప్రధాని ఆ ప్రస్తావనే తేవకపోవడం దారుణమని చెప్పారు. తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని వినోద్ డిమాండ్ చేశారు.
 
అలాగే మోదీ సర్కారు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిందని..ఏడు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు చెప్పాడన్నారు. ప్రధాని మోడీ స్వయంగా చొరవ తీసుకుని.. ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనియా ఎదురుపడితే జేసీ ఏమన్నారో తెలుసా? రాజీనామా చేసేస్తారా?