Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ పార్టీలో ఒక్క ధనవంతుడి బిడ్డపైనా కేసు నమోదు కాలేదు : అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:31 IST)
పోలీసులను దూషించిన కేసులో ఎంఐఎం కార్పొరేటర్‌పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ నగర పోలీసులను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో ఎంఐఎం కార్పొరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై హైదారాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. చట్టం ప్రతి ఒక్కరికీ సమానంగా అమలు కావాలన్నారు. 
 
హైదారాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ పట్టుబడిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలందరినీ వదిలివేశారు. ఏ ఒక్కరిపై కేసు నమోదు కాలేదని గుర్తుచేశారు. 
 
రేవ్ పార్టీలో కొకైన్ దొరికిందన్నారు. ఇక్కడ పట్టుబడిన ధనవంతుల పిల్లలందరూ విడుదలయ్యారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని గుర్తుచేశారు. 
 
"ఆర్టికల్ 13 ప్రకారం రూల్ ఆఫ్ లా అత్యున్నతమైనది. అందరికీ సమానమైనది. ఈ "రేవ్ పార్టీ"లో కొకైన్ కనుగొనబడటం చాలా దురదృష్టకరం. పైగా ధనవంతుల పిల్లలందరినీ విడుదల చేయడం చాలా మరీ దురదృష్టకరం అంటూ ట్వీట్ చేశారు. 
 
రూల్ ఆఫ్ లా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమానంగా అమలు చేయాలంటూ హైదరాదాద్ నగర పోలీసులు, మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments