తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంఐఎం కార్పోరేటర్‌పై మండిపడ్డారు. ఎంఐఎం కార్పోరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా వారిని వదలకూడదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కాగా.. బోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్.. తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తాను ఈ ఏరియాకు రావద్దని చెప్పినా.. మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ.. పోలీసులకు బెదిరించాడు.
అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కేటీఆర్ కార్పొరేటర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.