ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పై స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ "సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్"ను వెంటనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు.
మే నెలలో తప్పనిసరిగా శంకుస్థాపన చేస్తామని నిర్ధిష్ట హామీని ఇచ్చారు కేంద్ర మంత్రి రాణె. దీనిపై అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి నారాయణ రాణేతో పాటు కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్‌ను కలిశారు.
ఈ సందర్భంగా అమరావతి బహుజన జేఏసీనాయకుడు బాలకోటయ్య, సుంకర పద్మశ్రీ, కంచర్ల గాంధీ. అమరావతి రైతుల ఉద్యమానికి శరద్ పవార్ మద్దతు ఇచ్చారని తెలిపారు.