Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడొస్తాయ్?

నైరుతి రుతుపవనాలు ఈ నెల 5,6 తేదీల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాలకు ముందు తేమ గాలులు వీస్తుండడం వల్లేనని.. హైదరాబాద్‌

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (15:39 IST)
నైరుతి రుతుపవనాలు ఈ నెల 5,6 తేదీల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాలకు ముందు తేమ గాలులు వీస్తుండడం వల్లేనని.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి చెప్పారు.
 
వాతావరణ శాఖ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెయిన్‌గేజ్ స్టేషన్లలో 60 శాతం వర్షపాతం నమోదు కావడం, 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షం కురవడం, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో రుతుపవనాలు వస్తున్నట్టుగా గుర్తించామని వైకే రెడ్డి తెలిపారు. 
 
రేడియేషన్ తగ్గినప్పుడు రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ప్రకటిస్తామని వైకే రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్ణీత సమయానికి ముందే రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయని వైకే రెడ్డి చెప్పారు. జూన్ ఐదు నుంచి 8వ తేదీ లోపు తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని వైకే రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments