Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు...(Video)

మేషం: బ్యాంకు పనుల్లో ఆలస్యం ఇతర వ్యవహారాలపై ప్రభావం చూపుతుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్త్రీలకు దంతాలు, నరాలు, కళ్ళకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్

Advertiesment
ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు...(Video)
, మంగళవారం, 29 మే 2018 (16:37 IST)
దేశ ప్రజలకు చల్లని కబురు. ఈ యేడాది నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అరేబియా సముద్రం నుంచి కొమరిన్ ప్రాంతం మొత్తం ఈ రుతుపవనాలు విస్తరించాయి.
 
కేరళలోని మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లాం, అల్లపుజ, కొట్టాయం, కొచి, త్రిశూర్, కోచికోడ్, కాన్నూర్, తలశెరి, కుడులు, మంగళూర్ ప్రాంతాల్లో 48 గంటల్లో 2.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ 14 ప్రాంతాల్లో పడిన వర్షపాతం ఆధారంగా భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించినట్లు చెబుతున్నారు.
 
రుతుపవనాలు విస్తరణ ఈసారి చురుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జూన్ 7, 8 తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశించొచ్చు. ఇప్పటికే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండటంతో అనుకున్న సమయం కంటే ఒకటి, రెండు రోజుల ముందుగానే రావొచ్చని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఉందని అధికారులు అంటున్నారు. ఈ కారణంగా ఈ దఫా దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తాయని అంటున్నారు. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రోకర్‌లా వ్యవహరించి టీడీపీని బ్రోతల్‌ హౌస్‌లా నడిపిస్తున్నావ్.. మోత్కుపల్లి