Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నిపా సోకింది.. కొన్ని గంటల్లో చనిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త'... కన్నీరు తెప్పిస్తున్న నర్సు లేఖ

నిపా వైరస్ సోకింది. ఈ వైరస్ సోకితే చికిత్స లేదని తెలుసు. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. పిల్లల్న

'నిపా సోకింది.. కొన్ని గంటల్లో చనిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త'... కన్నీరు తెప్పిస్తున్న నర్సు లేఖ
, మంగళవారం, 22 మే 2018 (14:08 IST)
నిపా వైరస్ సోకింది. ఈ వైరస్ సోకితే చికిత్స లేదని తెలుసు. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మా నాన్నలా ఒంటరి జీవితాన్ని గడపకు అంటూ ఓ నర్సు తన భర్తకు రాసిన లేఖ ఇపుడు కేరళవాసులను కన్నీరు పెట్టిస్తోంది. నిపా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరిన రోగులకు చికిత్స చేస్తూ లినీ అనే నర్సు చనిపోయింది. అయితే, ఆమె చనిపోతూ భర్తకు రాసిన లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ లేఖను చదివిన ప్రతి ఒక్కరూ కన్నీరుపెడుతున్నారు.
 
కేరళ రాష్ట్ర వాసులను నిపా వైరస్ వణికిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి 10 మంది వరకు మృత్యువాతపడ్డారు. మరికొంతమంది ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. అయితే, తాజాగా ఓ విషాదం జరిగింది. నిపా వైరస్ బారినపడిన రోగులకు చికిత్స చేస్తున్న ఓ నర్సు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ నర్సు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు చివరిచూపు చూడకుండానే ఖననం చేశారు. 
 
అయితే, నర్సు లినీ.. మరికొద్దిసేపట్లో చనిపోతుంది అనగా తన భర్తకు రాసిన లేఖ వైరల్ అయింది. "నిపా వైరస్ రోగులకు చికిత్స చేస్తుండగా.. ఆ వైరస్ నాకు కూడా సోకింది. నాకు తెలుసు ఈ వైరస్‌కు చికిత్స లేదని. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వారిని గల్ఫ్ తీసుకెళ్లు. వారిని బాగా పెంచు. నేను లేను అని నీవు జీవితాంతం ఒంటరిగా ఉండకు. మా నాన్నలా నీ జీవితాన్ని ఒంటరితనం చేయొద్దు" అంటూ భర్తకు రాసిన లేఖ ఇప్పుడు అందరినీ కన్నీటిపర్యంతం చేస్తోంది. 
 
నిపా వైరస్‌కు చికిత్స చేస్తూ చనిపోయిన నర్సును వీరమరణం పొందిన వనితగా వైద్యులు, ప్రజలు కీర్తించారు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ సిన నర్సు దేశసరిహద్దులో పని చేసే జవాన్‌తో పోల్చారు. ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన ఒక కులసేన... దేనికి నిదర్శనం #PK గారూ అంటూ శ్రీరెడ్డి