ఆర్ఆర్ఆర్ టీజర్ పైన స్పందించిన ఎమ్మెల్యే సీతక్క

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:58 IST)
టాలీవుడ్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఇది. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇటీవల మళ్లీ మొదలైంది.
 
ఇదిలా ఉంటే... ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ లోని తారక్ పాత్రకు సంబంధించి టీజర్ రిలీజ్ చేసారు. రామ్ చరణ్ వాయిస్‌తో వచ్చిన ఈ టీజర్ అద్భుతం అనేలా ఉంది. టీజరే ఇలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో అనిపిస్తుంది. ఇందులో తారక్ కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
 
కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించడం విశేషం. మన్యం ముద్దుబిడ్డ, మా అన్న, మా ఆదర్శం కొమురం భీమ్ జయంతి సందర్భంగా నా ఘన నివాళులు. కొమురం భీమ్ స్ఫూర్తితో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments