Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం.. బాలికపై ఏడు రోజులు ఆటోలో తిరుగుతూ..?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (18:57 IST)
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోగల దేవరకద్ర మండలంలో 12 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు.

దేవరకద్ర మండలంలోని కోళ్ల ఫారంలో పని చేస్తున్న సూపర్వైజర్ ఇటీవల కొన్ని రోజులుగా విధులకు రావడం లేదు. దీంతో అక్కడ పనిచేసే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన 42 ఏళ్ల సాజిత్‌కు కోళ్ల ఫారం యజమాని సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించారు. 
 
అయితే తమ కుమార్తెను సాజిద్ అపహరించాడని అక్కడ పనిచేసే ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నవాబుపేట మండల కేంద్రంలో బాలికను గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
 
అనంతరం ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నిందితుడిపై లైంగికదాడి, ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈనెల 12న బాలికను ఆటోలో అపహరించి తీసుకెళ్లిన నిందితుడు.. 19వ తేదీ రాత్రి నవాబుపేట మండల కేంద్రంలో బాలిక దొరికేవరకు వారం రోజుల పాటు ఎక్కడెక్కడ తిప్పాడు? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? అతడికి సహకరించిన ఆటో డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 
 
నిందితుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడి ఆచూకీ లభించడం లేదు. దీంతో పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులను విచారించారు. అయితే నిందితుడికి ముగ్గురు భార్యలు ఉన్నారని విచారణలో పోలీసులకు తెలిసి అవాక్కయ్యారు. వారికి ఆరుగురు సంతానం ఉన్నారు. కుటుంబ గొడవల కారణంగా కొన్ని రోజులుగా వారి దగ్గర ఉండటం లేదని పోలీసులు విచారణలో తేలింది. దీన్నిబట్టి పోలీసులు రంగంలో దిగి నాలుగు బృందాలుగా ఏర్పడి బంధువుల వద్ద అతడి ఆచూకీ కోసం చూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments