Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

డ్యాన్స్ వీడియో వైరల్.. స్టార్ అయిపోయిన ఆటో డ్రైవర్.. మరాఠీ మూవీలో ఛాన్స్

Advertiesment
Pune
, బుధవారం, 17 మార్చి 2021 (16:36 IST)
Auto Driver
టాలెంట్‌ను ప్రదర్శించేందుకు చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ చాలు. స్మార్ట్ ఫోన్ ద్వారా రకరకాలైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొచ్చు. అలా టాలెంట్‌తో రాత్రికిరాత్రే స్టార్లు అయిపోవచ్చు. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ సాయంతో ఓ ఆటో డ్రైవర్ స్టార్‌గా మారాడు. సోషల్ మీడియాలో అతను పోస్టు చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఆయన డ్యాన్సు వీడియోకు వచ్చిన లైకులు, షేర్లు, కామెంట్లతో ఆటో డ్రైవర్ సెలబ్రిటీ అయిపోయాడు. అంతేకాకుండా.. ఏకంగా మరాఠి మూవీలో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, పుణె సిటీకి దగ్గరలోని బారామతి తాలుకాకు చెందిన బాబాజి కాంబ్లే అనే ఆటోడ్రైవర్‌కు డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్‌తో పాటు చక్కటి అభినయం కూడా అతని సొంతం. చక్కటి డ్యాన్సులతో.. నటనతో తోటి ఆటో డ్రైవర్లను రంజింపజేస్తుంటాడు. తన ఆటతో ఆనందింపజేస్తుంటాడు. అలా ఓ రోజున ఆటో స్టాండ్‌లో తన నటనకు పనిచెప్పాడు.
 
ఇటీవలే తన తోటి ఆటోడ్రైవర్ల ఎదుట 'మల జావు ధ్యానా ఘరి' అనే పాటకు మహారాష్ట్ర పాపులర్ డ్యాన్స్ 'లవని' స్టైల్‌లో పర్ఫార్మ్ చేసి ఫిదా చేశాడు. ఆ పాటకు అచ్చం సినిమా హీరోలా చేసిన ఆయన డ్యాన్స్ వీడియోను అతడి స్నేహితులు నెట్టింట షేర్ చేయగా, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
 
ఆ ఒక్క వీడియోతో కాంబ్లే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ వీడియోను మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయడం విశేషం.ఈ ట్రెండింగ్ వీడియో చూసిన మరాఠి ఫిల్మ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ విష్ణుపంత్ యేడే తన సినిమాలో నటించాలని కాంబ్లేకు ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో కాంబ్లే ఉబ్బి తబ్బిబైపోతున్నాడు. ఇక సినిమాలో ఆఫర్ లభించడంతో ఆటో డ్రైవర్ కాంబ్లే తెగ సంబరపడిపోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ నాశనం చేసారు: జేసీ కామెంట్స్