Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోల్డెన్ రేజర్‌‌తో ఆ బార్బర్‌ రేంజే మారిపోయింది..

Advertiesment
గోల్డెన్ రేజర్‌‌తో ఆ బార్బర్‌ రేంజే మారిపోయింది..
, శుక్రవారం, 5 మార్చి 2021 (12:08 IST)
Golden Razor
కరోనా సీన్ మొత్తం మార్చేసింది. వ్యాపారాలను నష్టాల్లో ముంచేసింది. లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారులు కోలుకుంటున్నారు. వ్యాపారాల్లో రాణించేందుకు ప్రస్తుతం కొందరు వ్యాపారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. పుణెకు చెందిన ఓ సెలూన్ షాప్‌ ఇలాంటి పనే చేసింది. ఇక్కడ ఏకంగా బంగారం రేజర్‌తో షేవింగ్ చేస్తున్నారు. బంగారంతో తయారు చేసిన రేజర్‌తోనే ఇక్కడ షేవింగ్స్ చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. అవినాష్ బొరుండియా అనే బార్బర్‌కు పుణె ఓ సెలూన్ షాప్ ఉంది. లాక్‌డౌన్‌కు ముందు బాగా వ్యాపారం జరిగేది. కస్టమర్లు బాగా రావడంతో అతడి ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉండేది. కానీ కరోనా రాకతో అంతా తలకిందులయింది. కస్టమర్లు లేక సెలూన్ షాప్ వెలవెలబోయింది. ఎలాగైనా కస్టమర్లను ఆకర్షించాలన్న ఉద్దేశంతో బంగారం రేజర్‌ను తయారు చేయించాడు. 80 గ్రాముతో తయారుచేసిన ఆ రేజర్‌కు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టాడు. షాప్ ముందు బంగారం రేజర్‌తో షేవింగ్ అని బోర్డుపెట్టేశాడు. ఇటీవలే ఓ ఎమ్మెల్యే చేతుల మీదుగా షాప్‌ను ప్రారంభించాడు.
 
బోర్డు చూసి జనాలు ఆశ్చర్యపోయారు. గోల్డెన్ రేజర్‌తో చేసింది కావడంతో.. కస్టమర్లు క్యూకడుతున్నారు. ఇప్పుడు అవినాష్ సెలూన్ షాప్ కళకళలాడుతోంది. గోల్డెన్ రేజర్‌తో షేవింగ్‌కు అతడు రూ.100 వసూలు చేస్తున్నాడు. అందుబాటు ధరలోనే ఉండడంతో అతడి షాప్‌కు గిరాకీ పెరిగింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాడు శాసనమండలిని రద్దు చేశారు.. నేడు ఏకగ్రీవంగా వైకాపా అభ్యర్థుల గెలుపు