Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్వారంటైన్ సెంటర్‌ నుంచి ఎస్కేప్.. కిటీకీల కమ్మీల నుంచి బయటికి రావాలని..?

క్వారంటైన్ సెంటర్‌ నుంచి ఎస్కేప్.. కిటీకీల కమ్మీల నుంచి బయటికి రావాలని..?
, మంగళవారం, 16 మార్చి 2021 (16:25 IST)
Pune Woman
పూణేలోని క్వారంటైన్ సెంటర్‌లో కోవిడ్ క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొందుతూ వచ్చిన 18 ఏళ్ల యువతి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కిటికీల గ్రిల్ నుంచి పారిపోవాలనుకుంది. మహారాష్ట్ర, పూణేల్లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. మున్సిపల్ అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ నుంచి తప్పించుకోవాలంటే.. కోవిడ్ నియమావళి పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
అప్పుడే కరోనా నుంచి దూరంగా వుండవచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూణే నగరంలోని ఓ క్వారంటైన్ సెంటర్లో 18 ఏళ్ల యువతి క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
పూణేలోని ఎరండ్వానే ప్రాంతంలోని ఓ క్వారంటైన్ కేంద్రంలో  రాత్రి 11.30 నిమిషాలకు.. రెండో అంతస్థులోని కిటికీ నుంచి బయటికి వచ్చేందుకు పయత్నించింది. కానీ విండో గ్రిల్‌లో చిక్కుకుపోయింది. ఆపై సదరు కోవిడ్ సెంటర్ అధికారులు హైడ్రాలిక్ కటర్‌ను ఉపయోగించి ఆ యువతిని గ్రిల్ నుంచి విడిపించారు. 
 
మరోవైపు కరోనాతో అతలాకుతలం అవుతున్న ముంబైలో ఓ మహిళ  క్వారంటైన్ సెంటర్ నుంచి పరారైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా మరోసారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో క్వారంటైన్ సెంటర్లో ఉండాల్సిన ఓ 30 ఏళ్ల యువతి అక్కడి నుంచి పరారైంది.
 
తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఎంచక్కా ఇంటికి వచ్చేసి ఉంటోంది. సదరు మహిళ క్వారంటైన్ సెంటర్లో మిస్ అయినట్లు భావించిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. క్వారంటైన్ సెంటర్లో తనకు అసౌకర్యంగా ఉందని, ఈ కారణంగానే తాను అక్కడి నుంచి పరారయ్యానని ఆమె చెప్పింది. ఇలా పరారయ్యే సమయంలో ఆమె కాలికి దెబ్బ తగిలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుల కోసం రూ.36వేల కొత్త పథకం.. రూ.55 నుంచి రూ.200ల దాకా కడితే..?