కర్నాటక రాజకీయాలను ఓ కుదుపుకుదిపిన అంశం మంత్రి రాసలలీల సీడీ వ్యవహారం. ఇది ఇపుడు రోజుకో విధంగా మలుపు తిరుగుతోంది. ఈ వీడియోలోవున్న యువతి హైదరాబాద్‌లో ఉన్నట్టు కర్నాటక ప్రత్యేక బృందం పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆమె ఆచూకీని తెలుసుకునేందుకు పోలీసులు భాగ్యనగరికి వచ్చే అవకాశం ఉంది.
కాగా, మంత్రితో రాసలీలల్లో మునిగితేలిన ఆ యువతి అనూహ్యంగా శనివారం రాత్రి ఆ సీడీలోని రికార్డు వీడియోను విడుదల చేసింది. 'ఇప్పటికే సమాజంలో నా పరువు పోయింది. రక్షణ కల్పించండి. నా తల్లిదండ్రులు, నేను పలుమార్లు ఆత్మహత్యకు యత్నించాం' అంటూ కర్నాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మైకు వేడుకుంది. ముఖ్యంగా, ఉద్యోగం కోసమే మంత్రి రమేశ్ జార్కిహొళిని కలిశానని తెలిపింది. అందులో పేర్కొంది.
దీంతో అప్రమత్తమైన ప్రత్యేక బృందం (సిట్) అధికారులు.. దర్యాప్తునకు హాజరుకావాలని ఆమెను కోరారు. లొకేషన్ ఆధారంగా ఆమె సెల్‌ఫోన్‌పై పోలీసులు నిఘా పెట్టారు. విజయపుర జిల్లా నిడగుందిని ఆ యువతి స్వగ్రామంగా గుర్తించారు. ఆ ఊరిలో ఉన్న ఆమె అమ్మమ్మ ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడ ఎవరూ లేకపోవడంతో నోటీసులు అంటించి వెనుదిరిగారు.
మరోవైపు, యువతి మిత్రుడిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడితో యువతి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. సీడీ విడుదలైన 12 రోజుల దాకా ఆచూకీ లేకుండా పోయిన యువతి, రమేశ్ జార్కిహొళి పోలీసులకు ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే మళ్లీ తెరపైకి రావడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు బెంగళూరు ఆర్‌టీ నగర్‌తోపాటు గోవాలోనూ గాలింపులు చేపట్టారు. యువతి హైదరాబాద్‌లో ఉందని పోలీసులు గుర్తించినట్లు తాజా సమాచారం. ఈ సీడీ బహిర్గతం కావడంతో రమేష్ తన మంత్రిపదవిని కోల్పోయిన విషయం తెల్సిందే.