Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆటో డ్రైవరుతో ఎఫైర్, భర్త వద్దన్నాడని ప్రియుడుతో సహా...

Advertiesment
ఆటో డ్రైవరుతో ఎఫైర్, భర్త వద్దన్నాడని ప్రియుడుతో సహా...
, గురువారం, 4 మార్చి 2021 (22:17 IST)
ముగ్గురు పిల్లల తల్లి ఆమె. ఇంట్లో పిల్లలతో హాయిగా గడపాల్సిన పరిస్థితి. కానీ అక్రమ సంబంధంతో చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు ఒక ఆటో డ్రైవర్ ప్రాణాలు పోయేందుకు కారణమైంది. పచ్చటి కాపురంలో చిచ్చు పెట్టింది. చివరకు కుటుంబం మొత్తం చిన్నాభిన్నంగా మారిపోయింది.
 
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనిపాళెంకు చెందిన ప్రియాంకకు 35 సంవత్సరాలు. భర్త సూర్యనారాయణ. ముగ్గురు పిల్లలు ఉన్నారు. సూర్యనారాయణ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ప్రియాంక కూలి పనిచేస్తుండేది. ఆర్థికంగా బాగానే ఉండేవారు. 
 
పిల్లలు స్కూళ్ళకు వెళ్ళేవారు. ఉదయాన్నే పిల్లలను స్కూళ్ళకు పంపించి ఇద్దరూ పనులకు వెళ్ళిపోయేవారు. అయితే కూలి పనిచేస్తున్న ప్రియాంక ప్రతిరోజు ఇంటికి దూరంగా ఉండటంతో ఆటోలో వెళుతూ ఉండేది. తనతో పాటు తన ఇంటి పక్కన ఉండేవారు కూడా ఆటోలో వెళుతూ ఉండేవారు.
 
ఆ ఆటోడ్రైవర్ పేరు సంతోష్. అతనితో ప్రియాంక పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కూలి పనికి వెళ్ళే ప్రియాంక ఖాళీ సమయంలో సంతోష్‌తో గడిపేది. రాసలీలల్లో ఇద్దరూ మునిగితేలేవారు. ఈ విషయం వారంరోజుల క్రితమే భర్త సూర్యనారాయణకు తెలిసింది.
 
ముగ్గురు పిల్లల తల్లి.. మన కుటుంబం పాడైపోయింది. ఇప్పటికైనా మానుకో అంటూ మందలించాడు. అందులోను నీ కన్నా చిన్న వయస్సు వాడు. 20 యేళ్ళ ఆటోడ్రైవర్‌తో నీకు ఆ సంబంధం ఏంటని నిలదీశాడు భర్త. అయితే ఆమెలో మార్పు రాలేదు.
 
భర్త గ్రామంలో పంచాయతీ పెట్టాడు. దీంతో ప్రియాంక మనస్థాపానికి గురైంది. ప్రియుడిని పిలిచింది. ఇద్దరూ కలిసి గ్రామ చివరలో పురుగుల మందు తాగారు. ప్రియాంక అపస్మారక స్థితిలో ఉండగా యువకుడు సంతోష్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా టీకా కేంద్రం ఎక్కడుందో తెలుసుకునేందుకు మ్యాప్ మై ఇండియా