Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా టీకా కేంద్రం ఎక్కడుందో తెలుసుకునేందుకు మ్యాప్ మై ఇండియా

Advertiesment
కరోనా టీకా కేంద్రం ఎక్కడుందో తెలుసుకునేందుకు మ్యాప్ మై ఇండియా
, గురువారం, 4 మార్చి 2021 (22:09 IST)
భారత ప్రభుత్వముచే నిర్వహించబడిన ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్ యొక్క విజేత అయిన మ్యాప్‌ మై ఇండియా, దేశవ్యాప్తంగా భారతీయులు తమ సమీప కరోనా టీకా కేంద్రాలను గుర్తించుటలో సహాయపడేందుకు గాను మ్యాపులు మరియు శోధన ఫీచర్లను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. భారత ప్రభుత్వము కూడా ప్రజలకు దిశానిర్దేశం చేసి తమ సమీప కేంద్రాలకు అనుసంధానం చేయడానికి గాను ఈ ఫీచర్లను తన అధికారిక కరోనా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ cowin.gov.in లోనికి ఈ ఫీచర్లను సమీకృతపరచింది. ప్రజలు మ్యాప్‌మైఇండియా మ్యాపుల యాప్ లేదా వెబ్‌సైటును ఉపయోగించి భారతదేశములో ఏ నగరము, పట్టణము లేదా గ్రామ వ్యాప్తంగా నైనా సులువుగా టీకా కేంద్రాలను వెతుక్కోవచ్చు.
 
సమీప కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను కనుక్కోవడానికి చర్యలు:
mapmyindia.com/move యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి లేదా maps.mapmyindia.com లేదా cowin.gov.in సందర్శించండి. సెర్చ్ బాక్సులో, కరెంట్ లొకేషన్ నొక్కండి లేదా మీ చిరునామా లేదా స్థలము పేరు లేదా ఆసక్తి ఉన్న ఇ-లాక్ ను ఎంటర్ చేయండి. ఇ-లాక్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఏ స్థలము కొరకైనా 6-అంకెల డిజిటల్ చిరునామా, ఏ స్థలము యొక్క ఇంటి ముంగిటినైనా తెలియజేయగల ఒక ప్రశస్తమైన పిన్ కోడ్ అయి ఉంటుంది (మరింత సమాచారం mapmyindia.com/eloc పై)
 
సెర్చ్/వ్యాక్సినేషన్ సెంటర్లపై క్లిక్ చేయండి. మీరు మీకు సమీపములోని వ్యాక్సినేషన్ సెంటర్లను లేదా మీకు ఆసక్తి ఉన్న స్థానమును చూస్తారు. ఆ టీకా కేంద్రానికి టర్న్ ఇండికేటర్లు మరియు వాస్తవ-సమయపు న్యావిగేషన్ (ప్రత్యక్ష ట్రాఫిక్ రద్దీ మరియు రోడ్డు భద్రత హానుల ఆధారంగా) ద్వారా కచ్చితమైన మలుపును పొందడానికి గాను మీరు గెట్ డైరెక్షన్స్ పైన క్లిక్ చేయవచ్చు. 
 
“కోవిడ్ పైన పోరులో, మనలో ప్రతి ఒక్కరూ పోషించాల్సిన పాత్ర ఒకటుంది. ఈ మహమ్మారి భారతదేశంలో ప్రవేశించిన నాటి నుండీ, మ్యాప్‌ మై ఇండియా, కరోనా సంబంధిత స్థలాలు - టెస్టింగ్, చికిత్స మరియు ఐసొలేషన్ కేంద్రాలు అదే విధంగా కంటైన్‌మెంట్ జోన్ల భౌగోళిక స్థానాలను వాస్తవ-సమయములో గుర్తించే పనిని చేపట్టింది. కీలకమైన వ్యాక్సినేషన్ కృషిని అంతరాయం లేకుండా చేయడానికిగాను, భారతదేశ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలన్నింటినీ మ్యాప్‌ మై ఇండియా, తన మ్యాప్‌ మై ఇండియా యొక్క మ్యాపులపై ఉంచింది.
 
వాడుకదారులు తమ సమీప టికా కేంద్రాలను వెతుక్కొని వాటికి దిశానిర్దేశాలను పొందడానికై మ్యాప్‌మైఇండియా యాప్ (mapmyindia.com/move) మరియు మ్యాపుల పోర్టల్(maps.mapmyindia.com)ను ఉపయోగించుకోవచ్చు. వారు సమీక్షలను వ్రాయవచ్చు, అక్కడ ఎదుర్కొనే సమస్యలను రిపోర్టు చేయవచ్చు - అధికారులు ఫీడ్‌బ్యాక్ పొందేలా సహాయపడేందుకు మరియు అవసరమైన చోట సరిపరచు చర్య తీసుకోవడానికి,” అన్నారు మ్యాప్‌ మై ఇండియా సిఇఓ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రోహన్ వర్మ గారు.
 
ఆయన ఇంకా మాట్లాడుతూ... “కోట్లాది మంది పౌరులు లాగిన్ కావడానికి మరియు తమ సమీప టీకా కేంద్రాలను కనుక్కోగలగడానికి వీలయ్యేలా మ్యాప్‌మైఇండియా యొక్క మ్యాపులు, ఎపిఐలు మరియు టేక్నాలజీలను తన అధికారిక వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్, యాప్ అయిన cowin.gov.inలో సమీకృతం చేయడం పట్ల మేము ఎంతో సంతోషించాము. భారత ప్రభుత్వానికి కృతజ్ఞులమై ఉన్నాము. ఇది ఆత్మనిర్భర్ భారత్ యొక్క అత్యుత్తమతను తెలియజేస్తోంది - ఇది దేశీయ ప్రజానీకం మరియు ప్రైవేటు రంగ సంస్థల మధ్య ఒక భాగస్వామ్యము- సులువైన జీవనము గడపడానికి, దేశానికి సమర్థతలను పెంపొందించడానికి వీలు కలిగేలా ప్రపంచ శ్రేణి, దేశీత టెక్నాలజీలను ఉపయోగించుకోవడం." 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి ఫిక్స్.. వరుడు కాదు పొమ్మన్నాడు.. అమెరికాలో చిత్తూరు అమ్మాయి ఆత్మహత్య