Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రితో కలిసి గుడికి వెళుతున్న యువతి కిడ్నాప్

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (13:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన తండ్రితో కలిసి గుడికెళ్లి పూజలు చేస్తున్న యువతిని తన స్నేహితులతో కలిసి ఓ యువకుడు కిడ్నాప్ చేశాడు. జిల్లాలోని చందుర్తి మండలంలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై యువకుడిపై యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ కిడ్నాప్ వ్యవహరమంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
జిల్లాలోని చందుర్తి మండలం, మూడపల్లి గ్రామానికి చెందిన గోలి శాలిని అనే యువతిని  మంగళవారం తెల్లవారుజామున హనుమాన్ ఆలయంలో పూజ చేస్తుండగా కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. ఈ యువతికి తోడుగా తండ్రి కూడా వెళ్లాడు. అయితే, అప్పటికే ఆలయం వద్దకు చేరుకున్న కిడ్నాపర్లు, ఆ యువతి తండ్రిని పక్కకు నెట్టేసి ఆమెను కారులో ఎక్కించుకుని పారిపోయారు. కారును ఆపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. 
 
తన కుమార్తె కిడ్నాప్ వెను గ్రామానికే చెందిన కటుకూరి జాన్ ప్రమేయం ఉండొచ్చని బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, గతంలో శాలిని, జాన్‌లు ఇంటి నుంచి ఒకసారి పారిపోయారని గ్రామస్థులు చెబుతున్నారు. ఆ సమయంలో శాలిని మైనర్ కావడంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతిని తిరిగి తీసుకొచ్చి అప్పగించారు. ఆ సమయంలో జాన్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
శాలినికి ఇటీవల మైనార్టీ తీరడంతో మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న జాన తన స్నేహితులతో వచ్చి కిడ్నాప్ చేసినట్టు సమాచారం. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగ విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments