Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు

exam hall
, మంగళవారం, 20 డిశెంబరు 2022 (11:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తాజాగా షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రధాన పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగుస్తాయి. మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జి, వంటి పరీక్షలు మాత్రం ఏప్రిల్ 4వ తేదీన ముగుస్తాయి. 
 
ఈ పరీక్షలను వంద శాతం సిలబస్‌తో నిర్వహిస్తారు. కరోనా సమయంలో చాయిస్ ప్రశ్నలను పెంచిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో నిర్వహించనున్న వార్షిక పరీక్షలను మాత్రం పూర్వస్థితిలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహిస్తారు. 
 
ఇంటర్ పస్టియర్ పరీక్షా షెడ్యూల్ 
 
మార్చి 15న ద్వితీయ లాంగ్వేజ్
మార్చి 17న ఇంగ్లీష్ 
మార్చి 20న బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చి 23న గణితం బి, జువాలజీ, హిస్టరీ 
మార్చి 25న ఫిజిక్స్, ఎకనామిక్స్ 
మార్చి 28న కెమిస్ట్రీ, కామర్స్
మార్చి 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్య్
ఏప్రిల్ 3న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ 
 
ఇంటర్ ద్వితీయ సంవత్సరం షెడ్యూల్ 
 
మార్చి 16న ద్వితీయ లాంగ్వెజ్
మార్చి 18న ఇంగ్లీష్ 
మార్చి 21న మ్యాథ్స్ ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చి 24న గణితం బి, జువాలజీ, హిస్టరీ
మార్చి 27న ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చి 29న కెమిస్ట్రీ, కామర్స్, 
ఏప్రిల్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్
ఏప్రిల్ 4న మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నువ్వు నాకే దక్కాలి అంటూ ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు