Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన మహిళకు కరోనా రెండో డోస్ : ధృవీకరణ పత్రం కూడా జారీ...

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (10:47 IST)
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా రాష్ట్రాల్లో తప్పులు దొర్లుతున్నాయి. అనేక మందికి వ్యాక్సిన్ వేయకుండానే వ్యాక్సిన్ వేసినట్టుగా ఫోన్ సందేశాలు వస్తున్నాయి. అలాగే, పలు ప్రాంతాల్లో చనిపోయిన వారికి కూడా రెండో డోస్ టీకాలు వేసినట్టు ధృవీకరణ పత్రాలు జారీచేశారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.
 
నగరంలోని దమ్మాయిగూడకు చెందిన కె.కౌశల్య అనే 81 యేళ్ల వృద్ధురాలు మే 4వ తేదీన కరోనా తొలి డోస్ టీకా వేయించుకున్నారు. ఆ తర్వాత ఆమె అనారోగ్యంబారినపడటంతో రెండు నెలల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విషయం తెలియని వైద్య సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు రెండో డోస్ గడువు సమీపిస్తుందని, ఆస్పత్రికి వచ్చి టీకా వేయించుకోవాలని సూసిచంచారు. కానీ, కౌశల్య చనిపోయారని కుటుంబ సభ్యులు హెల్త్ వర్కర్లకు తెలిపారు. ఇంతవరకు బాగానేవుంది.
 
సరిగ్గా పక్షం రోజుల తర్వాత అంటే నవంబరు 8వ తేదీన కౌశల్య రెండో డోస్ టీకా తీసుకున్నట్టుగా మొబైల్ ఫోనుకు సందేశం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా ఎలా వేస్తారంటా ప్రశ్నించారు. ప్రభుత్వాలు నిర్దేశిస్తున్న టీకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు వైద్య సిబ్బంది కూడా ఇలాంటి పొరపాట్లను ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నట్టుగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments