Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈటెలతో ఆ పని చేయించేందుకు సిద్థమవుతున్న బిజెపి.. ఏం ప్లానంటే..?

Advertiesment
ఈటెలతో ఆ పని చేయించేందుకు సిద్థమవుతున్న బిజెపి.. ఏం ప్లానంటే..?
, మంగళవారం, 9 నవంబరు 2021 (23:01 IST)
ఇప్పుడు తెలంగాణాలో బిజెపి అంటే కెసిఆర్‌కు వణుకు పుడుతోందన్న ప్రచారం బాగానే సాగుతోంది. హుజురాబాద్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు తరువాత టిఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కెసిఆర్ అనవసరంగా స్పందిస్తూ తనకున్న విలువను తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటున్నారన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినబడుతోంది.

 
అసలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ తనపై ఎన్ని విమర్సలు చేసినా పట్టించుకోకుండా సైలెంట్‌గా ఉంటూ వచ్చిన కెసిఆర్ హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి తరువాత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. నేరుగా బిజెపి నేతలపైనా బూతుపురాణాలను మొదలుపెడుతున్నారు.

 
ఛానల్ లైవ్ లోనే సహనం కోల్పోయి మాట్లాడేస్తున్నారు. కొ..కా అంటూ పార్టీ అధ్యక్షుడిని సంభోధించారు. ఇది కాస్త బిజెపి నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తమయ్యేలా చేస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే ఈటెల గెలుపుతో కెసిఆర్ చాలా కోపంతో ఉన్నారట. 

 
తెలంగాణాలో ఎన్నో పథకాలను తీసుకొస్తే చివరకు ప్రజలు ఈటెలకు ఓట్లేయడంపై కెసిఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో దీన్నే పావుగా వాడుకుని కెసిఆర్‌ను ఎదుర్కోవాలంటే ఈటెల రాజేందర్ ఒక్కడే సరైన వ్యక్తని కాబట్టి అతనికి బిజెపిలో సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నారట.

 
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఈటెలను ప్రకటించి ఆ తరువాత పార్టీ కార్యకలాపాలను అప్పగించాలన్న ఆలోచనలో బిజెపి ముఖ్య నేతలు ఉన్నారట. ఈటెలను ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకుండా తెలంగాణాలోని జిల్లాల్లో పర్యటించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కూడా పార్టీ నేతలు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. 

 
కెసిఆర్‌ను ఏ విధంగానైనా ఎదుర్కోవడానికి ఇప్పటికే సిద్థంగా ఉన్న ఈటెల రాజేందర్ అస్సలు తనకు పార్టీలో ఎలాంటి పదవులు లేకపోయినా ఒక సాధారణ వ్యక్తిలాగా ప్రభుత్వంపై పోరాడటానికి సిద్థంగా ఉన్నాడట. ఈ విషయాన్ని ఆయన అనుచరులే స్పష్టం చేస్తున్నారు. మరి బిజెపి ప్లాన్ ఏ స్థాయిలో ఫలిస్తుందన్నది ఆశక్తికరంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంజాయి పంట ధ్వంసం