Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్న కులం యువకుడితో ప్రేమ, కుమార్తెను హత్య చేసిన తల్లి

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (19:04 IST)
వరంగల్ జిల్లాలో మరో పరువు హత్య. జిల్లాలోని పర్వతగిరి గ్రామంలో నిమ్న కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉందనే ఆరోపణతో ఓ మహిళ తన తల్లి సహాయంతో తన కూతురిని హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.

 
ఈ ఘటన నవంబర్ 20 తెల్లవారుజామున జరుగగా ఆమె మరణాన్ని ఇద్దరూ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు రంగప్రవేశం చేసి హత్యలో వారి పాత్రను నిర్ధారించారు. కేసుపై సమగ్ర విచారణ తర్వాత వారిని అరెస్టు చేశారు.
 
 
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌ డీసీపీ వెంకటలక్ష్మి హత్య వివరాలను వెల్లడించారు. సమ్మక్క, బాబుల కుమార్తె ఉబ్బని అంజలికి 17 ఏళ్లు. ఆమె అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ తో ప్రేమను కొనసాగిస్తోంది. విషయం తెలిసిన యువతి తల్లి సమ్మక్క అతడితో సంబంధం మానుకోవాలని హెచ్చరించింది.

 
నిమ్న కులానికి చెందిన ప్రశాంత్‌తో అంజలి సంబంధాన్ని యువతి తల్లి-అమ్మమ్మ ఇష్టపడలేదు. వారు అతడితో వున్న సంబంధాన్ని తెంచుకోవాలని ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ అంజలి అందుకు నిరాకరించడంతో, సమ్మక్క- ఆమె తల్లి సమాజంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. 

 
దాంతో వారిద్దరూ యువతి ముఖంపై దిండుతో అదిమి గొంతు నులిమి చంపేసారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు’’ అని డీసీపీ తెలిపారు. సమ్మక్కపై అనుమానం రావడంతో మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పర్వతగిరి ఇన్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌ ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. పోలీసుల బృందం ఆధారాలు సేకరించిన తర్వాత ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుడు పోలీసుల ముందు నేరం అంగీకరించారని డీసీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

నాలో చిన్నపిల్లాడు ఉన్నాడు, దానికోసం థాయిలాండ్ లో శిక్షణ తీసుకున్నా: తేజ సజ్జా

మిరాయ్‌లో మహేష్ బాబు రాముడిగా నటిస్తున్నారా? తేజ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments