తెలంగాణాలో సంపూర్ణ లాక్డౌన్ ఎత్తివేత: కేబినెట్

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (16:24 IST)
లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించి ఈ మేరకు లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్‌డౌన్‌ను రేపటి నుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తి స్థాయి సన్నద్ధతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. 
 
ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం తదితర కరోనా నియమావళిని అనుసరించాలని కేబినెట్ కోరింది. 
 
ఈ మేరకు అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రోజు నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. దీంతో, అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. అయితే అంతరాష్ట్ర బస్ సర్వీసులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మే 12న తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments