లాక్‌డౌన్ మీరు నిర్ణయం తీసుకుంటారా? లేక మమ్మల్ని తీసుకోమంటారా? తెలంగాణ సర్కార్ పైన హైకోర్టు

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (17:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. రాగల 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైన ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలనీ, లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చీఫ్ జస్టిస్ అన్నారు.
 
ఆర్‌టిపిసి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచన చేసింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్‌లో  నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. Health.telangana.gov.in వెబ్‌సైట్లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలని సూచించింది.
 
ఇంకా పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్‌లలో ప్రజలు భారీగా గుమిగూడకుండా వుండేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదిక అసంపూర్తిగా వుందని, మరోసారి సమగ్రమైన నివేదికను కోర్టుకి సమర్పించాలని విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం