Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు చౌరస్తాలో కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహావిష్కరణ

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (12:28 IST)
భారత్ - చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఈయనకు కోర్టు చౌరస్తాకు సంతోష్‌ బాబు పేరు పెడ్తామని కుటుంబ సభ్యులకు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చింది. 
 
సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహావీర చక్ర, కల్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు విగ్రహాన్ని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 
 
మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కోర్టు చౌరస్తాకు కల్నల్‌ సంతోష్‌ బాబు పేరును నామకరణం చేస్తారని తెలిపారు. అలాగే, ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు పాత జాతీయ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లోని చేపలు, పండ్ల మార్కెట్‌ బ్లాక్‌లను కూడా ప్రారంభిస్తారని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments