తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా కాలంలో వందల కొద్దీ రిక్వెస్టులు వస్తున్నాయి. కరోనా కాలంలో ఆపదలో వున్నవాళ్లు సాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. వాటిలో తనకు వీలైనంత వరకు సాయం చేస్తున్నాడాయన. రీసెంట్గా సాయం అందుకున్న ఓ వ్యక్తి కేటీఆర్‌ను సూపర్‌హీరోగా పొగడగా.. అందుకు సోనూసూద్ అర్హుడంటూ కేటీఆర్ బదులిచ్చారు.
తనకు దక్కిన సాయానికి కృతజ్ఞతగా నందకిషోర్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అడగ్గానే.. అందేలా చూసినందుకు థ్యాంక్స్‌తో సరిపెట్టలేనని ఆ వ్యక్తి పోస్టు చేశాడు. అడిగిన వెంటనే సాయం అందించనందుకు కృతజ్ఞతలని, తెలంగాణ ప్రజలకు మీతరపున అందుతున్న సాయం మరువలేనిదని, చివరగా మీరు సూపర్ హీరో అని చెప్పాలనుకుంటున్నానని నందకిషోర్ ట్వీట్ చేశాడు.
అందుకు కేటీఆర్ ప్రతిగా స్పందించారు. ప్రజల ప్రతినిధిగా తోచిన సాయం చేస్తున్నా బ్రదర్ అంటూ తెలిపారు. మీరు సోనూసూద్‌ను(ట్యాగ్ చేసి మరీ) సూపర్ హీరో అనడం కరెక్ట్. ఆపదలో ఉన్నవాళ్లు మీరు సాయం అందించండని ఆ వ్యక్తికి సూచించాడు. కేటీఆర్ రిప్లైకి సోనూసూద్ కూడా స్పందించారు.
థ్యాంక్ యూ సో మచ్ సర్. కానీ, తెలంగాణకు మీరు ఎంతో చేస్తున్నారు. కాబట్టి మీరే రియల్ హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ నాకు మరో ఇంటిలాంటిది. ఏళ్లుగా ఇక్కడి జనాలు నా మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు అని సోనూసూద్ రీ ట్వీట్ చేశారు.