Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గేయ రచయిత కందికొండ గిరికి కేటీఆర్ చేయూత

Advertiesment
గేయ రచయిత కందికొండ గిరికి కేటీఆర్ చేయూత
, గురువారం, 10 జూన్ 2021 (12:11 IST)
kandikonda giri
ప్రముఖ గేయ రచయిత కందికొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు.ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడారు.
 
కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయని, ఆయన సాహిత్య సేవ మరింత కాలం కొనసాగేలా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిలషించారు. ప్ర‌స్తుతం గిరి వెంటిలెటర్ పై సికింద్రాబాద్ దగ్గర లోని కిమ్స్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.. వెంటిలెటర్ ఛార్జెస్ ఒక రోజు కి 70,000 రూపాయలు, మెడిసిన్స్, బెడ్ ఛార్జెస్ అన్ని సపరేటు. 
 
ప్రముఖ సినీ గేయ రచయిత, శాలివాహన బిడ్డ, సరస్వతి పుత్రుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కష్టపడి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీ.హచ్. డి పూర్తి చేశారు. తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలని రాసిన "కందికొండ గిరి " ప్రస్తుతం గొంతు క్యాన్సర్ వ్యాధితో భాధపడుతు. గత కొన్ని రోజులుగా హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
 
జీ.హెచ్.ఎం.సి, తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్కల పాట, కాళేశ్వరం పాట, దీపావళి పాట,సంక్రాంతి పాట మరియు ఎన్నో హిట్ సినిమాలైన దేశముదురు,పోకిరి,మున్నా,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి మరెన్నో చిత్రాలలో దాదాపు 1200 పాటలు రాసాడు. ర‌జనీకాంత్ `లింగ‌` సినిమాకూ రాశారు. ర‌జ‌నీతో బొకే తీసుకున్న ఫొటోను ఆయ‌న ఫేస్‌బుక్‌లో పెట్టి ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.
 
గత 15 రోజుల నుండి అపోలో హస్పిటల్ లో చికిత్స నిమిత్తం అత్యధికంగా వైద్య ఖర్చులైనవి. ఇప్పుడు ప్రస్తుతం కిమ్స్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలుపెర‌గ‌ని ఆవేశం బాలకృష్ణ సొంతం