మహానటుడు ఎన్.టి.ఆర్. వారసుడిగా సినీరంగంలో ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ 1960, జూన్ 10న జన్మించారు. ఈరోజు ఆయనకు చిత్రరంగంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు. మిత్రుడు బాలకృష్ణకి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటూ అక్కినేని నాగేశ్వరరావుతో కూడిన ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఇక ఆయన అభిమానులు అయితే కరోనా టైంలో బాలకృష్ణ రావద్దని అనడంతో పలు చోట్ల పలురకాలు బాలకృస్ణ కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం విశేషం.
ఇక జూనియర్‌ఎన్.టి.ఆర్. కూడా, జన్మదిన శుభాకాంక్షలు బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశాడు. మరోవైపు కళ్యాణ్‌రామ్ కూడా, 61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇక బాలకృష్ణ కెరీర్ కూడా ఎత్తుపల్లాలమీద నడింది. అయినా ప్లాప్ లు వచ్చినా పెద్దగా ఆలోచించకుండా తర్వాత సినిమాపై ఆయన దృష్టిపెడతాడు. 1974 తాతమ్మకల చిత్రం నుంచి నేటి అఖండ వరకు 107 సినిమాలు చేశారు. ఆయన ఒక్కో సినిమా ఒక్కోశైలిలో వుంటుంది. డైలాగ్ డెలివిరీ కూడా విభిన్నంగా వుంటుంది. అభిమానులకు ఆయన ఆవేశపూరిత డైలాగ్‌లకు ఫిదా అయిపోయేవారు. కంటిచూపుతో చంపేస్తా, నీలా దొంగలా కాదురా దొరలా నీ ఇంటికి వచ్చా. నీ నట్టింటికి వచ్చా. అంటూ ఆయన చెప్పిన సన్నివేశపరమైన డైలాగ్‌లు ఇప్పటికీ పిల్లలూ ఎంజాయ్ చేస్తూనే వుంటారు.
తండ్రి నుంచి వారసత్వంగా నటనేకాదు. భక్తిని అలవర్చుకున్నారు. అదే ఆయన్ను ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ స్థాయికి చేర్చింది. అభిమానులు ఆయన్ను ఆప్యాయంగా బాలయ్య అంటూ పిలుస్తుంటారు. ఆయనకు కోపం ఎక్కువని అభిమానులు అనుకున్నా, చాలా సందర్భాలు ఆయన కోపాన్ని చవిచూసినా ఆయన నైజం అంతే అన్నట్లుగా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇప్పటికీ 61 ఏళ్ళలోనూ ఆయన అలుపెరుగని ఆవేశం ఆయన సొంతం అంటూ ఆయన అభిమానులు ఆయన గురించి గొప్పగా చెబుతూ పుట్టినరోజు నాడు ఓ కవిత్వాని రాసేశారు. మొహమాటంలేని ముక్కసూటి తనం ఆయనది.
ఆయన కెరీర్‌కు ట్రెండ్ సెట్ క్రియేట్ చేసింది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలే. మాస్ ఎలిమెంట్ పాత్రలకు ఫ్యాక్షన్ బేక్‌డ్రాప్ సినిమా అంటేనే బాలకృష్ణ గుర్తుకు వస్తారు. ఇంకోవైపు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రయోగాత్మక సినిమాలు చేశారు. ఆదిత్య 369, భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం వంటివి ఆయనుంచి వచ్చినవే. బి.గోపాల్ తర్వాత ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలకు అడ్డగా నిలిచిన దర్శకుడు బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో వచ్చిన సింహా, లెజెండ్ ఎంతో విజయాన్ని చవిచూశాయి. మూడోసారి `అఖండ`తో ముందుకు రాబోతున్నాడు. దర్శకుడు క్రిష్‌తో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చేశారు. తనే దర్శకుడిగా తన తండ్రి గురించిన బయోపిక్‌ను తానే నిర్మించాలని కథానాయకుడు, మహానాయుడు అనే రెండు భాగాలు చేశారు. అందులో తండ్రిని మరిపించిన నటుడిగా పేరు పొందాడు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.
కానీ అవేవీ పట్టించుకోకుండా తను చేసే పనిలో నిమగ్నమై ముందుకు దూసుకుపోతున్న కథానాయకుడు నిజజీవితంలోనూ ప్రజల జీవితాలను బాగుచేయాలని హిందూపురంలో ఎం.ఎల్.ఎ.గా గెలిచి సేవ చేస్తున్నారు. కరోనా వంటి సమయంలో అక్కడి ప్రజలకు వేక్సిన్ ప్రక్రియతోపాటు ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన ఘటన ఆయనదే. ఇంకోవైపు తండ్రి ఆశయం మేరకు రూపొందిన బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని అనుక్షణం పర్యవేక్షిస్తూ రోగులకు ఉపశమనం కలిగిస్తున్నారు. ఆయన మరెన్నో విజయాలు సినిమాపరంగా, రాజకీయపరంగా సేవ చేయాలని వెబ్‌దునియా కోరుకుంటోంది.