Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.1438 కోట్లు విడుదల

Advertiesment
ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.1438 కోట్లు విడుదల
, గురువారం, 10 జూన్ 2021 (08:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో కూడిన సీమాంధ్ర ప్రదేశ్ తీవ్రమైన రెవెన్యూ లోటును ఎదుర్కోంటుంది. ఈ లోటును విభజన హామీల్లో భాగంగా కేంద్రం భర్తీ చేయాల్సివుంది. కానీ కేంద్ర ఆ పని చేయడం లేదు. నామమాత్రంగానే రెవెన్యూ లోటును భర్తీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1,438 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 
 
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు మొత్తం రూ.9,871 కోట్లను మూడో విడత రెవెన్యూలోటు భర్తీ కింద విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు దక్కాయి. వీటితో కలుపుకుని రాష్ట్రానికి ఇప్పటి వరకు రూ.4,314.24 కోట్లు అందాయి.
 
కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను 17 రాష్ట్రాలకు కలిపి రూ.1,18,452 కోట్ల రెవెన్యూ గ్రాంటును విడుదల చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా, ఈ మొత్తాన్ని 12 వాయిదాల్లో చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మొత్తం వాయిదాల్లో కలిపి ఏపీకి మొత్తంగా రూ.17,256.96 కోట్లు రానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి మృతి