మునుగోడు ఉప ఎన్నిక ప్రచం ముగించుకుని తెరాస మంత్రి కేటీఆర్ తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన రోడ్డుపక్కన క్షతగాత్రులు పడివుండటాన్ని గమనించారు. ఆ వెంటనే ఆయన తన కాన్వాయ్‌ను ఆపి తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరై ఆయన హైదరాబాద్ నగరానికి తిరిగి వెళుతుండగా, రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసిన కేటీఆర్ తన కాన్వాయ్‌ను ఆపారు. కారు దిగి రోడ్డు ప్రమాద బాధితులను ఎక్కించుకుని ఆయన పరామర్శించారు. అనంతరం వారిని తన కాన్వాయ్‌లోని ఓ కారులో వారిని ఎక్కించుకుని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.