వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్లా ఓడిపోతారు : కిషన్ రెడ్డి

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (15:26 IST)
ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ రెండు స్థానాల్లో ఓడిపోతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, రేపటి ఎన్నికల్లో ప్రజాగ్రహం ఎలా ఉందో రేపటి ఎన్నికల్లో తెలుస్తుందని తెలిపారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిల్లో పోటీ చేస్తున్నారని, ఆయన రెండు చోట్లా ఓడిపోతారని స్పష్టం చేశారు. ప్రజల్లో ఎంతటి ఆగ్రహజ్వాలులు రగులుతున్నాయో రేపటి ఎన్నికల్లో తెలుస్తుందని అన్నారు. తెలంగాణ యువత సునామీలా విజృంభించి బీఆర్ఎస్‌ని పార్టీని తుడిచిపెట్టేస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితమే తెలంగాణ అంతటా పునరావృత్తం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments