అద్దంలో చూసుని కంగారుపడిన ఎలుగుబంటి ... నవ్వు తెప్పించే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2023 (13:52 IST)
అద్దంలో తనను తాను చూసుకున్న ఓ ఎలుగుబంటి కంగారుపడిపోయింది. అచ్చం తన రియాక్షన్ కూడా అలాగే ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. పైగా, దీనికి సంబంధించి ఓ నవ్వు తెప్పించే వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదివారం పూట కాస్త తొందరగా లేస్తే తన రియాక్షన్ కూడా అలాగే ఉంటుందని ఆయన  వ్యాఖ్యానించారు. ఈ వీడియోకు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో నిరంతరం చురుగ్గాగు ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా... అనేకమైన అద్భతమైన, స్ఫూర్తిదాకయమైన విషయాలను షేర్ చేస్తుంటారు. వీటిలో కొన్ని నవ్వు తెప్పించే వీడియోలు కూడా ఉంటాయి. అలాంటి నవ్వు తెప్పించే వీడియోను ఒకదాన్ని ఆయన తాజాగా షేర్ చేశారు. 
 
అడవిలో ఓ చెట్టుకు కట్టిన అద్దం నిలువెత్తు అద్దాన్ని చూసిన ఓ ఎలుగుబంటు ఒక్కసారిగా షాకైంది. ఆ వెంటనే వెనుక తనలాంటిదే ఇంకొకటి ఉందోమోనని వెళ్లి చూసింది. అక్కడా కనిపించకపోవడంతో గాభరా పడింది. అద్దాన్ని పట్టుకుని చూసింది. దానిని బలంగా లాగడంతో అది కాస్త కిందపడిపోయింది. ఈ ఎలుగుబంటి గాభరాపడటం చూస్తే ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుతారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా... ఆదివారాల్లో మరీ ఉదయాన్నే లేచినపుడు తన రియాక్షన్ కూడా ఇలానే ఉంటుందని చెబుతూ నవ్వులు పూయించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments