Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచార షెడ్యూల్ ఇదే...

kcrao
, ఆదివారం, 5 నవంబరు 2023 (09:51 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తన రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన తన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ నుంచి సీఎం కేసీఆర్ తన రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించి 28వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ రోజుల్లో ఆయన మొత్తం 54 బహిరంగ సభల్లో పాల్గొంటారు. 
 
ఈ ప్రచారంలో భాగంగా ఈ నెల 17వ తేదీన కరీంనగర్, 22వ తేదీన కొడంగల్, 25వ తేదీన హైదరాబాద్, 26వ తేదీన దుబ్బాక, 28న గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొననున్నారు. కేసీఆర్ ఇప్పటివరకు 30 నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీ వరకు మరో 12 సభలకు హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్ 9వ తేదీన గజ్వేల్లో, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు చేస్తారు.
 
సీఎం కేసీఆర్ రెండో దఫా షెడ్యూల్‌ ఇదే.. 
13వ తేదీన దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట, 
14వ తేదీన పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం,
15వ తేదీన బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్, 
16వ తేదీన అదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్, 
17వ తేదీన కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల, 18వ తేదీన చేర్యాల,
19వ తేదీన అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, 
20వ తేదీన మానకొండూరు, స్టేషన్ ఘనపూర్, నకిరేకల్, నల్గొండ, 
21వ తేదీన మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట,
22వ తేదీన తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి, 
23వ తేదీన మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు,
24వ తేదీన మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, 25వ తేదీన హైదరాబాద్,
26వ తేదీన ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, 
27వ తేదీన షాద్ నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి,
28వ తేదీన వరంగల్, గజ్వేల్ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితంలో రాత్రులన్నీ వృథా అయిపోతున్నాయి... ఎన్నికల శిక్షణకు రాలేనన్న ఉపాధ్యాయుడు ... ఎక్కడ?