హైదరాబాద్‌లో కిన్లే వాటర్ బాటిల్ 207 రూపాయలా?

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (16:48 IST)
మందుబాబులు ఆ బార్‌కు వెళితే..  ప్రతి పెగ్గులోనూ మోసం. బహిరంగ మార్కెట్లో కిన్లే వాటర్ బాటిల్ ధర 20 రూపాయలు కదా? మరి ఆ బాటిల్ ధరను 207కి అమ్ముతున్నారా ? అంటే... అవును అనే సమాధానం వస్తోంది. ఇంతకీ ఈ రేట్లు ఎక్కడంటే హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఓ ప్రముఖ బార్ అండ్ రెస్టారెంట్‌లో. 
 
ఆ బార్‌లో కిన్లే వాటర్ బాటిల్ 207 రూపాయలు అమ్ముతున్నారు. ఈ బార్ పైన తూనికలు కొలతల శాఖ అధికారుల దాడులు చేసిన సందర్భంలో ఈ ధరలు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. 20 రూపాయల కిన్లే వాటర్ బాటిల్‌ను 207 రూపాయలకు అమ్మడంతో పాటు, 99 రూపాయల రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్‌ను 209 రూపాయలకు బార్ నిర్వాహకులు అమ్ముతున్నారు. 
 
అంతేకాదు మద్యం ప్రియులు తాగే ప్రతి పెగ్గులోనూ 11 శాతం మందును తక్కువగా సర్వ్ చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఈ విధంగా వినియోగదారులు బాగా నష్టపోతున్నారు. అలా మద్యం తాగే మద్యం ప్రియులు చెల్లించే ప్రతి 1336 రూపాయల బిల్లులో 147 రూపాయలు మోసానికి పాల్పడుతున్న వైనాన్ని గుర్తించి, 
బార్ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేసారు తూనికలు కొలతల శాఖ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments