కిడ్నీ మిస్సింగ్... వైద్యులే కాజేశారంటూ రోగి బంధువులు...

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (19:31 IST)
కడుపులో నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చేరితే చికిత్స పేరుతో వైద్యులు కిడ్నీని కాజేశారంటూ ఓ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రి ముందు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శివ ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తికి కడుపులో నొప్పిగా ఉండటంతో చికిత్స చేయించుకోవడం కోసం యూఎస్ఏ నుండి వచ్చి మలక్ పేట యశోద ఆసుపత్రిలో చేరారు. 
 
పరీక్ష చేసిన వైద్యులు కడుపులో ట్యూమర్ ఉందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి ట్యూమర్‌ని తీసి శివప్రసాద్ తల్లిదండ్రులకు చూపించారు. అయితే కొద్ది గంటల తర్వాత అతని ఆరోగ్యం మరింత విషమించింది. డాక్టర్లు అతడిని వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందించారు. అక్కడ పనిచేసే డాక్టర్ ఉమాశంకర్ చెపుతూ...  శివప్రసాద్ శరీరం నుండి ఒక కిడ్నీ తీసివేసి ఉందని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
 
ముందురోజే చికిత్స కోసం పది లక్షలు చెల్లించామనీ, ఇంతలో కిడ్నీ ఎలా మాయమైందని డాక్టర్‌లను నిలదీశారు. మీరే కీడ్నీని దొంగిలించారని వైద్యులపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments