Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్... మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

Webdunia
శనివారం, 20 జులై 2019 (19:01 IST)
ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లు ఇస్తున్నామని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రశాంత్ నగర్, గణేష్ నగర్, అంబేడ్కర్ నగర్‌లో పలు వార్డుల్లో పెరిగిన పెన్షన్‌ల మంజూరు పత్రాలని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల కష్టాలు తెల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయల నుండి 2016 ,1500 నుండి 3016 రూపాయలు పెంచి పేదల గుండెల్లో కేసీఆర్ ఒక ఆసరాగా నిలుస్తున్నాడన్నారు. 
 
ఆరు నెలల నుండి ఎన్నికల కోడ్ వల్ల ఈ కార్యక్రమం ఆలస్యం అయిందని చెప్పారు. పెరిగిన పెన్షన్ వల్ల పేదల ఆత్మగౌరవం కాపాడామన్నారు...వికలాంగులకు 3016 రూపాయల వల్ల కొండంత అండగా దేశంలోని 29 రాష్ట్రాలలో130 కోట్ల జనాభాలో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నది ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు. పెన్షన్ దేశంలో ఎక్కడా లేదనీ, ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. సీఎం కేసీఆర్‌కి తృప్తిని ఇచ్చిన పథకం ఈ పథకం అని వెల్లడించారు.
 
 57 ఏండ్లు నిండిన వారికి, కొత్తగా పిఎఫ్ వచ్చిన బీడీ కార్మికులను గుర్తించి పెరిగిన పెన్షన్లు అందిస్తామని త్వరలోనే సిద్దిపేటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రోమ్ ఇల్లు నిజమైన పేదలకు ఇస్తామని చెప్పారు. సిద్దిపేట పట్టణములో ప్రతి నెల 13,857 మందికి,  2,88 కోట్లు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.
 
మొక్కను నాటి పట్టణమంత పచ్చదనంగా చేసుకుందాం...
సిద్దిపేట పట్టణం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోంది అని ప్రజలకు ఎంత అభివృద్ధి చేశానో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే నా తపన అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆకుపచ్చ సిద్దిపేట, ఆరోగ్య సిద్దిపేట, ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మార్చడంలో మనమందరం మరింత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని13,866 మంది పెన్షన్‌దారులు ఒక్కొక్క మొక్కను నాటి దానిని సంరక్షించాలి అని చెప్పారు.
 
ఇంటి ముందు చెట్టు లేని ఇల్లు కూడా ఉండొద్దు అని చెప్పారు. మన ఇల్లు మనకు ఎంత ముఖ్యమో సిద్దిపేట పట్టణం కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలని, అందుకు ప్రతి రోజు వచ్చే చెత్త బండిలో చెత్తను వేరు చేసి తడి, పొడి చెత్త వేరువేరుగా వేయాలని, మన పట్టణాన్ని, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. 
 
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా బంద్ చేయాలి, దానివల్ల క్యాన్సర్ వంటి రోగాలు వచ్చి చనిపోతున్నారని చెప్పారు. 10 మంది చనిపోతే అందులో 8 మంది కాన్సర్‌తోనే చని పోయారని ఈమధ్య కాలంలో చాలా విన్నాను అని చెప్పారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించే దిశగా ప్రతి ఇంటికి జ్యుట్ బ్యాగ్‌లు పంపిణీ చేసామని, కూరగాయలకు పోయినా.. నాన్ వెజ్ మార్కెట్‌కి పోయినా ప్లాస్టిక్ కవర్లు బంద్ చేయాలని, సిద్దిపేటను ప్లాస్టిక్ రహితంగా మార్చుకుందాం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments