Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంలో కుమార్తె పెళ్లి .. తండ్రిని కబళించిన రోడ్డు ప్రమాదం

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (08:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇరుకుల్లలోని ఓ ఇంట విషాదం జరిగింది. మరో వారంలో తన కుమార్తెకు పెళ్లి చేయాల్సిన ఓ తండ్రి అకాల మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. దీంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన పచ్చవ వెంగయ్య(47) భార్య హేమలతతో కలిసి 20 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కరీంనగర్‌కు వచ్చి కిసాన్‌నగర్‌లో నివాసముంటున్నారు. 
 
ముగ్దుంపూర్‌ శివారులో ఇటుకబట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వెంగయ్యకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు వర్ష వివాహం శ్రీహరి లోహిత్‌తో ఈ నెల 23న పాలకొల్లులో జరిపించడానికి ముహూర్తం పెట్టుకొని పెళ్లిపత్రికలు అచ్చు వేయించి, బంధువులకు, స్నేహితులకు పంపిణీ చేస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే దసరా పండగ సందర్భంగా ఇటుక బట్టీలవద్ద కూలీలను కలిసి వారికి పండుగ ఏర్పాట్లను చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తన కారులో ఇంటికి బయలు దేరారు. ఇరుకుల్ల వాగు సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనం లైట్లతో రోడ్డుపైన ఉన్న డివైడర్‌ కనిపించక కారు డివైడర్‌ మీద నుంచి అవతలి వైపునకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. 
 
కారు బెలూన్లు తెరుచుకున్నప్పటికీ కారు వేగంగా ఉండటంతో వెంగయ్య వెనుక సీటులోకి ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వెంగయ్య అంత్యక్రియలు శనివారం సాయంత్రం కరీంనగర్‌లో జరిపించినట్లు ఆయన స్నేహితులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments