Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడవాళ్లు మీకు జోహార్లు ఫస్ట్ లుక్ విడుదల

ఆడవాళ్లు మీకు జోహార్లు ఫస్ట్ లుక్ విడుదల
, శనివారం, 16 అక్టోబరు 2021 (18:15 IST)
Sharwanand, Rashmika Mandanna
శర్వానంద్ ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఆయన ఓ కుటుంబ కథా చిత్రాన్ని చేస్తున్నారు. ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ రాబోతోన్న ఈ మూవీని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. శర్వానంద్, కిషోర్ తిరుమల ఇద్దరూ కూడా ప్రస్తుతం కొత్త జానర్‌ను ట్రై చేస్తున్నారు.
 
దసరా కానుకగా ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను  విడుదల చేశారు. ఇక ఇంట్లో పండుగ వాతావరణాన్ని తలపించేలా.. గుమ్మానికి పూల తోరణాలు కట్టారు. రష్మిక, శర్వానంద్ ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో ఈ జోడి ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తోంది.
 
ఆడవాళ్లు  మీకు  జోహార్లు అనే సినిమాతో శర్వానంద్ మొదటిసారిగా రష్మిక మందన్నా, కిషోర్ తిరుమలతో కలిసి పని చేస్తున్నారు. శర్వానంద్  ఈ చిత్రంలో పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నారు. రష్మిక అద్భుతమైన పాత్రను పోషిస్తోంది. టైటిల్‌ను బట్టి చూస్తే  ఈ చిత్రం మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తోంది.
 
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
 
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రెండ్‌కు త‌గిన‌ట్లు తీసిన పెళ్లి సందD కి ఆద‌ర‌ణః కె.రాఘ‌వేంద్ర‌రావు