ప్రాణం తీసిన పొరపాటు... రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో జూ.ఆర్టిస్ట్ మృతి

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (09:00 IST)
ఓ చిన్నపొరపాటు ప్రాణం తీసింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేసిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన షాద్ నగర్ రైల్వే స్టేషనులో జరిగింది. సంక్రాంతి పండగకి సొంతూరుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడపకు చెందిన జ్యోతిరెడ్డి (28) అనే యువతి హైదరాబాద్ నగరంలో హెచ్‌డీఎఎఫ్‌సి బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ నగరానికి పయనమైంది. 
 
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్ నగరులో రైల్వే స్టేషన్‌లో ఆగింది. రైలు ఆగడంతో కాచిగూడ వచ్చేశామని భావించిన జ్యోతి రైలు దిగేసింది. అయితే, ఆ తర్వాత అది షాద్‌నగర్‌ అని తెలుసుకుని కంగారుపడింది. అప్పటికే రైలు కదలదడంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన జ్యోతిరెడ్డిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు జ్యోతి మృతికి రైల్వే నిర్లక్ష్యమే కారణంగా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments