Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెల్లి శవంతో అక్క నాలుగు రోజుల సహజీవనం...

చెల్లి శవంతో అక్క నాలుగు రోజుల సహజీవనం...
, మంగళవారం, 18 జనవరి 2022 (19:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. చెల్లి శవంతో ఓ అక్క ఏకంగా నాలుగు రోజులు పాటు సహజీవనం చేసింది. చెల్లి మృతి చెందినట్టు ఎవరికి చెప్పాలో తెలియక ఆమె శవం వద్దే కూర్చొని నాలుగు రోజుల పాటు విలపించింది. చివరకు ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తదే, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్‌కు చెందిన ఓ దంపతులకు స్వాతి, శ్వేత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోగా, తండ్రి మాత్రం ఇద్దరు కుమార్తెలను విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్కా చెల్లెళ్లే కలిసి నివసిస్తున్నారు. 
 
అయితే, నాలుగు రోజులుగా శ్వేత కనిపించకుండా పోయింది. దీనిపై స్వాతి వద్ద ఆరా తీయగా ఆమె వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వారి ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూసి ఖంగుతిన్నారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బెడ్‌పై చెల్లి శవాన్ని పడుకోబెట్టి, శ్వేత వంట చేసుకుంటూ తింటూ నాలుగు రోజులుగా ఆ దుర్వాసనలోనే గడిపింది. 
 
ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం‌కు తరలించారు. కాగా, స్వాతికి మతిస్థిమితం సరిగ్గా లేదని, అంతకుముందు అక్కా చెల్లెళ్ళు, తల్లి చనిపోయినపుడు కూడా రెండు రోజుల పాటు తల్లి శవం వద్దే ఉన్నారని స్థానికులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తారక రాముడుకి వాడవాడలా నివాళి... ఎన్టీఆర్ 26వ వర్ధంతి