జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : మైనర్ నిందితులకు బెయిల్

Webdunia
గురువారం, 28 జులై 2022 (08:48 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నలుగురు నిందితులు మంగళవారం సాయంత్రం జువైనల్ హోం నుంచి విడుదలయ్యారు. 
 
గత మే నెల 28వ తేదీన 17 యేళ్ల మైనర్ బాలికపై అత్యాచానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నలుగురు మైనర్ బాలుర్లతో పాటు ఒక మేజర్ సాహుద్దీన్ మాలిక్‌లు కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచారం జూబ్లీహిల్స్ సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశంలో కారులోనే జరిగింది. మద్యంపార్టీకి వెళ్లిన బాలికపై కొందరు యువకులు ట్రాప్ చేసి, ఇంటివద్ద దించుతామని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. 
 
ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాదాపు 400 పేజీలతో కూడిన చార్జిషీటును సిద్ధం చేశారు. నిందితుల కాల్ లిస్ట్, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రిపోర్టులు, డీఎన్‌ఏ రిపోర్టులు, ఇతర సంబంధిత ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో దాదాపు 24 మంది సాక్షులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments