ఐటి దాడులను రేవంత్ రెడ్డి ముందే ఊహించారా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రేవంత్‌ రెడ్డి నివాసాల్లో ఐటి శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసం కొడంగల్‌లోని ఇంటితో పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న రేవంత్‌రెడ్డి తిరుమ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:45 IST)
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రేవంత్‌ రెడ్డి నివాసాల్లో ఐటి శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసం కొడంగల్‌లోని ఇంటితో పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి నేరుగా కొడంగల్‌ చేరుకుని ఈ రోజు కొడంగల్‌ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. 
 
ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రచారం ప్రారంభానికి ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం రేవంత్ అభిమానుల్లో కలకలం రేపింది. రేవంత్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం తిరుమలలోనే ఉన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న రేవంత్ నివాసంలో కుటుంబ సభ్యులెవరూ లేరు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ బృందంలో ఆ ఇంటిలో సోదాలు చేస్తోంది. రేవంత్ రెడ్డి సోదరులు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ, అలాగే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.
 
అందులో రేవంత్ రెడ్డి భాగస్వామి. తమ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని రేవంత్‌ కొద్ది రోజుల క్రితమే వ్యాఖ్యానించటం విశేషం. తనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు రేవంత్. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేనప్పుడు ఇంటికి సీలు వేసి వెళ్లాల్సిన ఈడీ అధికారులు తాళాలు ఎలా పగలగొడుతారు అంటూ మండిపడుతున్నారు రేవంత్ కుటుంబసభ్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments