Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈసారి కొండగల్ నుంచి రేవంత్ రెడ్డి పారిపోయేట్లున్నారు...

రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఆరు నూరైనా సరే కొడంగల్ సీటుపై కన్నేసింది అధికార పార్టీ. అందుకే అభివృద్ధి పేరుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. అయితే ఈ

Advertiesment
ఈసారి కొండగల్ నుంచి రేవంత్ రెడ్డి పారిపోయేట్లున్నారు...
, శనివారం, 4 ఆగస్టు 2018 (21:08 IST)
రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఆరు నూరైనా సరే కొడంగల్ సీటుపై కన్నేసింది అధికార పార్టీ. అందుకే అభివృద్ధి పేరుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి ఇలాకాలో టీఆర్ఎస్ పార్టీ పలు అభివృద్ధి కార్యక్రమాలు పేరుతో జన సమీకరణ చేసింది. 
 
ఒకరకంగా చెప్పాలంటే హరీష్ రావు పూర్తిగా అభివృద్ధి పేరుతో కొడంగల్ ప్రజలను ఆకట్టుకున్నారు. తెలంగాణ వచ్చాక ప్రజలకు పవర్ వచ్చిందని, కాంగ్రెస్ పార్టీకి పవర్ పోయిందని విమర్శించారు. టిఆర్ఎస్ అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాల ప్రాంతాలు తెలంగాణాలో కలుస్తామని అంటున్నారని తెలియజేశారు. రానున్న రోజుల్లో 264 కోట్ల రూపాయలతో కొడంగల్‌కు మంచి నీరు అందిస్తామని మరో 15 రోజుల్లో ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వబోతున్నాం అన్నారు. రేపటి నుంచి 5 లక్షల బీమా ఇచ్చి రైతుల్లో ధీమా నింపుతున్నాం.. నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు 2 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నాం.
 
కాంగ్రెస్ నాయకులు ఆనాడు తెలంగాణకు అడ్డం పడ్డారు.. ఇప్పుడు అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు.. శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు ఇస్తాం. కొడంగల్ ప్రజలు మా పార్టీని ఆశీర్వదించండి. గులాబీ పార్టీని గెలిపించండి అని హరీష్ రావు తెలియజేశారు. ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని చూస్తేంటే ఈసారి కొడంగల్ నుంచి రేవంత్ పారిపోవడం ఖాయంగా కనిపిస్తుందని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. మరి కొడంగల్ ఓటర్లు అభివృద్ధికి పట్టం కడతారో రేవంత్ రెడ్డి వైపునకు నిలబడతారో కాలమే తేల్చాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యజమాని కాళ్లూ చేతులు నాకిన కుక్క... చేతులు-కాళ్లు తీసేశారు...