Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో నేడు కూడా వర్షాలే.. ఆ జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (08:55 IST)
తెలంగాణా రాష్ట్రంలో శుక్రవారం కూడా భారీ వర్షం కురువనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రమట్టానికి ఏడున్నర కిలోమీటర్ల ఎత్తు మేరకు ప్రభావం కొనసాగుతోంది. ఈ కారణంగా వచ్చే 48గ గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
సముద్రమట్టం వద్ద రుతుపవన ద్రోణి జైసల్మేర్, భోపాల్, గోండియా, జగదల్‌పూర్, కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతానికి చేరుతుందని తెలిపింది. అందువల్ల శుక్రవారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం హైదరాబాద్ నగరంతో సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు మొదటి రెండు ప్రమాద హెచ్చరికలను జారీచేసింది. 
 
ఈ అల్పపీడన ప్రభావం కారణంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత బారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అందువల్ల ఈ జిల్లాల్లో ఆరెంజె హెచ్చరికలను జారీచేసింది. అలాగే, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పాలమూరు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో ఇక్కడ కూడా ఎల్లో హెచ్చరికను జారీచేసింది. ఈ ప్రభావం కారణంగా ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ : ఆదిత్య ఓం

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments