Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని కలుసుకోవాలి పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఠాణా ముందు బైఠాయించిన యువతి

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (11:33 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోవుంది. దీన్ని కేంద్రం ఆదేశం మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంధీగా అమలు చేస్తున్నాయి. ఈ లాక్‌డౌన్ అనేక మంది ప్రేమపక్షులకు ఏమాత్రం రుచించడం లేదు. తమ ప్రియుడిని కలుసుకోవాలని ప్రియురాలు.. తమ గర్ల్‌ఫ్రెండ్‌ను చూడాలని బాయ్‌ఫ్రెండ్స్ భావిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం అకారణంగా రోడ్లపై కనిపిస్తే మాత్రం లాఠీలకు పని చెబుతున్నారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. 
 
అదేసమయంలో పలు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్‌లలో చిత్ర విచిత్ర కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కేరళ రాష్ట్రంలో కొందరు పిల్లలు ఆహారం కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకెక్కారు. 
 
తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ నగరంలో ధనవంతులు నివసించే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విచిత్రమైన కేసు నమోదైంది. తన ప్రియుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఠాణాకు వచ్చింది. దాంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. 
 
కాగా, అంతకుముందు రోజే ఆ యువకుడు అమ్మాయి ఇంటిదగ్గరకు వెళ్లాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు యువకుడిపై వేధింపులు కేసు పెట్టాడు. ఇంతలోనే ఆ యువతి తన ప్రియుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఠాణా ముందు బైఠాయించింది. ఆ తర్వాత ఆ యువతి తల్లిదండ్రులను పిలిచి యువతికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments