Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడితో ప్రేమ.. తాగి యువతి ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (13:45 IST)
యువకుడితో ప్రేమాయణం ఓ యువతి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే.. సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన అలవాల ప్రత్యూష (18) హైదరాబాద్‌లో ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ప్రత్యూష తన అమ్మమ్మ వారింటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది. 
 
అమ్మమ్మ ఇంటిపక్కన ఉండే జగదీష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమించానని చెప్పాడు. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇద్దరు ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. 
 
ప్రేమ పరిచయం ఏర్పడిన ఎనిమిది నెలల తరువాత తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో ప్రత్యూష మనస్తాపానికి గురైంది. ఏప్రిల్ 30న హైదరాబాద్‌లో శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు ప్రియుడు జగదీష్ కారణంగానే చనిపోయిందని బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
ప్రత్యూష మృతదేహంతో సత్తుపల్లి మండలం తంబూరు గ్రామంలో జగదీష్ ఇంటి ముందు ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో జగదీష్ తల్లిదండ్రులు ఇంటి నుంచి పారిపోయారు. ఎస్‌ఐ నరేష్ అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశామని దర్యాప్తు చేస్తున్నామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమింపజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments