హైదరాబాదులో మోదీ పర్యటన.. నగరంలో ఆంక్షలు ఎక్కడంటే..?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (14:54 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదులో శనివారం పర్యటిస్తున్న నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్‌ ట్రాపిక్‌ పోలీసులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 
 
ఆపై సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నేరుగా  పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ప్రయాణించొద్దని ప్రయాణికులకు పోలీసులు సూచించారు.
 
ఇంకా ప్రధాన పర్యటన సందర్భంగా మోనప్ప జంక్షన్-టివోలి జంక్షన్-సెయింట్ జాన్ రోటరీ-సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్‌, ఆర్‌పీరోడ్‌-ఎస్పీ రోడ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడం జరిగింది. 
 
అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే...
టివోలి క్రాస్‌రోడ్‌ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్‌ల మధ్య ఉన్న రోడ్డును మూసివేస్తారు. 
ఎస్‌బీఎస్‌ క్రాస్‌రోడ్‌ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డు మూసివేత
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వేస్టేషన్‌ చేరుకోవాలి.  చిలకలగూడ జంక్షన్‌ వైపు నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌లోకి ప్రవేశాలను పరిమితం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments