Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ పేరెంటింగ్‌ ప్రయాణంలో అత్యుత్తమ స్నేహితునిగా నిలువనున్న ‘పేరెంట్‌ ట్రైబ్‌’ బై సూపర్‌బాటమ్స్‌

young children
, గురువారం, 6 ఏప్రియల్ 2023 (23:28 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ మామ్‌ అండ్‌ బేబీ కేర్‌ బ్రాండ్‌, సూపర్‌బాటమ్స్‌ ఫేస్‌బుక్‌ కమ్యూనిటీ- పేరెంట్‌ ట్రైబ్‌లో ఇప్పుడు 78వేల మందికి పైగా పేరెంట్స్‌ నమోదు చేసుకోవడం ద్వారా భారతదేశంలో ఫేస్‌బుక్‌పై  పేరెంట్స్‌(తల్లిదండ్రులు) కోసం పేరెంట్స్‌ చేత పేరెంట్స్‌ ప్రారంభించిన అతిపెద్ద కమ్యూనిటీగా నిలిచింది. పేరెంటింగ్‌ అనేది ఎప్పుడూ నల్లేరు మీద నడక కాదు. అందువల్ల మనకెప్పుడూ కూడా ఇతరుల సహాయం అవసరం పడుతుంది. సూపర్‌బాటమ్స్‌ ట్రైబ్‌ అనేది దేశవ్యాప్తంగా పేరెంట్స్‌కు మద్దతు యంత్రాంగంగా నిలుస్తుంది.
 
పేరెంట్‌ ట్రైబ్‌ అనేది ఆన్‌లైన్‌ కమ్యూనిటీ. ఇది తల్లిదండ్రులు ఒకరితో ఒకరు కనెక్ట్‌ కావడానికి సహాయపడటంతో పాటుగా తమ అనుభవాలను పంచుకోవడం, సలహాలను కోరడం, పేరెంటింగ్‌కు సంబంధించి పలు అంశాల పట్ల మార్గనిర్ధేశనం పొందడం చేయడంలో సహాయపడుతుంది. గత సంవత్సర కాలంలో ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ గణనీయంగా వృద్ధి చెందడంతో పాటుగా భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన పేరెంట్‌ గ్రూప్‌గా నిలిచింది.
 
సూపర్‌బాటమ్స్‌ సీఈఓ, కో-ఫౌండర్‌ పల్లవి ఉతగి మాట్లాడుతూ, ‘‘సూపర్‌బాటమ్స్‌ వద్ద మా వరకూ పేరెంట్‌ ట్రైబ్‌ అనేది మా వ్యక్తిగత పేరెంట్స్‌ సైన్యం. ఈ బ్రాండ్‌తో వారు లోతైన బంధం కలిగి ఉన్నారు. మా వినియోగదారులకు ఆవల, మా ట్రైబ్‌ మాకు ప్రచారకులుగా తోడ్పడటమే కాదు, నిజాయితీగా ఉండేందుకు, స్థిరంగా ఆవిష్కరణలను జరిపేందుకు, అత్యున్నత ఉత్పత్తులను సహ సృష్టించేందుకు సైతం తోడ్పడుతుంది. మా పేరెంట్‌ ట్రైబ్‌లో ఒకరు చేరితే, వారు నిరంతరం పెరుగుతున్న  పేరెంట్స్‌ కమ్యూనిటీలో భాగమవుతారు మరియు వారి పేరెంటింగ్‌ ప్రయాణంలో మేము భాగస్వాములవుతాము’’ అని అన్నారు.
 
ఈ ఆన్‌లైన్‌ కమ్యూనిటీగా మాత్రమే కాక, పేరెంట్‌ ట్రైబ్‌ విస్తృత శ్రేణి వనరులు, సేవలను తల్లిదండ్రులకు అందిస్తుంది. వీటిలో వెబినార్లు, వర్క్‌షాప్‌లు వంటివి పలు పేరెంటింగ్‌ అంశాలపై నిర్వహించడంతో పాటుగా పీడియాట్రిషియన్‌లు, న్యూట్రిషియనిస్ట్‌లు, చైల్డ్‌ సైకాలజిస్ట్‌ల సలహాలు సైతం అందిస్తారు. సూపర్‌ బాటమ్స్‌ ఉత్పత్తులపై ప్రత్యేక రాయితీలు, డీల్స్‌ సైతం లభ్యమవుతాయి. వీటితో పాటుగా వినోదాత్మక పోటీలు, ఉత్సాహపూరితమైన బహుమతులు కూడా  గెలుచుకునే అవకాశం కూడా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటిమిట్టకు సతీసమేతంగా వెళ్లాల్సి వస్తుందనే జగన్ కుంటిసాకు : అచ్చెన్నాయుడు