Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండుగ సంబరాలు- ఉత్సాహపూరితమైన ఆఫర్లతో క్రిస్మస్‌ ఆనందాన్ని పంచుతున్న వండర్‌లా హైదరాబాద్‌

Advertiesment
image
, గురువారం, 15 డిశెంబరు 2022 (19:29 IST)
భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌గా ఖ్యాతిగడించిన వండర్‌లా హాలీడేస్ లిమిటెడ్‌, క్రిస్మస్‌ సంబరాలను వండర్‌లా హైదరాబాద్‌ వద్ద 24 డిసెంబర్‌ 2022 నుంచి 01 జనవరి 2023 వరకూ నిర్వహించబోతుంది. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో లైవ్‌ షోస్‌, సీజనల్‌ స్వీట్లు మరియు ట్రీట్స్‌, పండుగ అలంకరణలు, ప్రకాశవంతమైన విద్యుత్‌ దీపాలు, ఫుడ్‌ ఫెస్ట్‌, వినోద క్రీడలు, డీజె, ప్రత్యేక ప్రదర్శనలు మరియు మరెన్నో  భాగంగా ఉంటాయి. వీటితో పాటుగా 45కు పైగా రైడ్స్‌, వండర్‌లాను అన్ని వయసుల వారికి అత్యుత్తమమైన ఒన్‌ డే డెస్టినేషన్‌గా మారుస్తాయి.
 
క్రిస్మస్‌ సంతోషాన్ని మరింతగా విస్తరించేందుకు, వండర్‌లా ఇప్పుడు ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ ప్రకటించింది. దీనిలో భాగంగా ఐదు రోజుల ముందు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారు 10% రాయితీ పొందవచ్చు. అంతేకాదు, 22 సంవత్సరాల వయసు లోపు కాలేజీ విద్యార్ధులు  ఫ్లాట్‌ 20% రాయితీని టిక్కెట్‌పై పొందవచ్చు. అయితే వారు తమ కాలేజీ ఒరిజినల్‌ ఐడీ కార్డు చూపాల్సి ఉంటుంది. టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల ద్వారా పార్క్‌కు వచ్చే సందర్శకులు పార్క్‌ ప్రవేశ టిక్కెట్లపై 15% రాయితీ ని టిక్కెట్‌ కౌంటర్‌ వద్ద ఆ టిక్కెట్‌ అందజేసిన ఎడల పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్ట్‌కప్‌ గండిపేట వద్ద ఫ్లీయా మార్కెట్‌ను నిర్వహించనున్న హారిజన్స్‌ ఇండియా