Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రిస్మస్ శుభాకాంక్షలు, క్రిస్మస్ ట్రీ విశిష్టత ఏంటో తెలుసా?

Advertiesment
Christmas greetings
, శుక్రవారం, 24 డిశెంబరు 2021 (23:29 IST)
క్రిస్మస్. ఈ పండుగ సందర్భంగా ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు కనబడుతుంటాయి. ఇప్పుడంటే ఆర్టిఫీషియల్ క్రిస్మస్ ట్రీలు షాపుల్లో దొరికేస్తున్నాయి కానీ అప్పట్లో సరివిచెట్ల కొమ్మలు తెచ్చి, దాన్ని క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైందని అంటారు. 15వ శతాబ్ధంలో లివోనియాలో మొదట క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలయ్యింది అని చెప్తుంటారు. చారిత్రకంగా క్రిస్మస్‌ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్‌ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించింది అని అంటారు.

 
సైనికాధికారి ‘జనరల్‌ ఫెడరిక్‌ అడాల్ఫ్‌ రెడిజిల్‌’ ఇచ్చిన క్రిస్మస్‌ విందులో అతిథులను అబ్బురపరచటం కోసం ‘ఫర్‌’ చెట్టుని కొవ్వొత్తులతో, పండ్లతో అలంకరించాడట. 19వ శతాబ్ద ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత రష్యా తదితర దేశాల్లోనూ సంపన్న కుటుంబాలవారు క్రిస్మస్‌ చెట్టుని ఉపయోగించటం మొదలుపెట్టారు.

 
1816లో ‘నస్సావో-విల్‌బర్గ్‌’ యువరాణి ‘హెన్‌రేటా’ క్రిస్మస్‌ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసిందట. ఆతర్వాత ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి విస్తరించింది. ఫ్రాన్స్‌ దేశంలోకి 1840లో డచ్‌ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్‌ దేశంలోకి 19వ శతాబ్ద ప్రారంభంలో క్రిస్మస్‌ సంప్రదాయంలో భాగమైంది. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజ్య భవనంలో ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొంది, క్రైస్తవులందరి ఇళ్లలోకీ క్రిస్మస్ ట్రీ చేరిందని సమాచారం. సంస్కరణోద్యమ పితామహుడు మార్టిన్ లూథర్ మొదటగా ఈ చెట్టుకు దీపాలు పెట్టి అలంకరించారు. అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్లు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారని సమాచారం. 

 
చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరిసంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలూ గుర్తించాయి. ఆ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైంది. పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు.

 
క్రిస్మస్‌కు ప్రారంభం ముందు నుంచే క్రైస్తవులు తమ ఇళ్లపై నక్షత్ర ఆకృతులను అలంకరించుకుంటారు. తూర్పు దేశాల వారికి దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రీస్తు జయంతి సందర్భంగా ప్రత్యేక చిహ్నంగా భావిస్తారు. అందుకు క్రీస్తు రాకను కాంక్షిస్తూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, ఇళ్లపై అలంకరించడం ఒక సంప్రదాయంగా నేటికీ కొనసాగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన శ్రీవారి టిక్కెట్లు