Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

, శనివారం, 25 డిశెంబరు 2021 (12:53 IST)
ఏపీ సీఎం జగన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో సీఎస్ఐ చ‌ర్చికి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లి క్రిస్మ‌స్ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థ‌న‌ల్లో జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, భార్య భారతి కూడా పాల్గొన్నారు.
 
ప్ర‌జ‌లంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని దేవుడిని కోరుకున్న‌ట్లు జ‌గ‌న్ ఈ సంద‌ర్బంగా చెప్పారు. కాగా, తెలంగాణ‌లోనూ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలను గుర్తు చేసుకుంటూ ప్ర‌జ‌లు ఈ వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. 
 
క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ‌లోని మూడు లక్షల మందికి ప్రభుత్వం కానుకలు అందించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. క్రైస్త‌వులు క‌రోనా నిబంధనలు పాటిస్తూ ఈ పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్ ను కలిసిన ఎంఎల్ సిలు తలశిల, లేళ్ల అప్పిరెడ్డి