Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హార్ట్‌కప్‌ గండిపేట వద్ద ఫ్లీయా మార్కెట్‌ను నిర్వహించనున్న హారిజన్స్‌ ఇండియా

image
, గురువారం, 15 డిశెంబరు 2022 (19:18 IST)
పెట్‌ ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తూ హార్ట్‌ కప్‌ కాఫీ వద్ద వినూత్నమైన కార్యక్రమం నిర్వహించబోతుంది హారిజన్స్‌ ఇండియా. నగరంలో పెట్‌ ప్రియులను లక్ష్యంగా చేసుకుని డిసెంబర్‌ 18వ తేదీన ఫర్‌ ఎఫైర్‌ను నిర్వహించనుంది. హారిజన్స్‌ ఇండియా నిర్వహించబోతున్న ఈ ఫ్లియా మార్కెట్‌లో విస్తృతశ్రేణిలో స్టాల్స్‌ అందుబాటులో ఉంటాయి.


వీటిలో పెట్‌ ప్రొడక్ట్స్‌, ఫ్యాషన్‌, క్యాండిల్స్‌, నోట్‌బుక్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా పెట్‌ ప్రేమికులకు మరింత ఆనందం కలిగిస్తూ పెట్‌ షోస్‌, పెట్‌ గ్రూమింగ్‌, పెట్‌పోటీలు, వెట్‌ విజిట్స్‌ కూడా ఆ రోజు అక్కడ ఉంటాయి. ఫుడీస్‌ కోసం రుచికరమైన మెనూను హార్ట్‌ కప్‌ కాఫీ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. చవులూరించే ఉడ్‌ ఫైర్డ్‌ పిజ్జా, లైవ్‌గ్రిల్స్‌, బార్బిక్యు మాత్రమే కాదు ప్రత్యేకంగా డ్రింక్స్‌ కూడా సందర్శకులను ఆకట్టుకోనున్నాయి.
 
ఈ మార్కెట్‌ వినోదం పెద్దలకు మాత్రమేనా అని నిట్టూర్చాల్సిన అవసరం లేదు. చిన్నారుల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. వారి కోసం ప్రత్యేకంగా ప్లే జోన్స్‌, గేమ్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇక్కడితో ఈ వినోదం అయిపోదు... అక్షర్‌ బ్యాండ్‌ మరియు డీజె మూవ్‌-ఇట్‌లు ఖచ్చితంగా మిమ్మల్ని అలరించడమే కాదు, అప్రయత్నంగానే మీలోని డ్యాన్సర్‌ను బయటకు తీసుకువస్తారు.
 
హారిజన్స్‌ ఈవెంట్స్‌ ఫౌండర్‌ భరత్‌ సూర్య మాట్లాడుతూ, ‘‘ మొట్టమొదటిసారిగా హార్ట్‌ కప్‌ కాఫీతో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం అతిథులకు  పెట్‌ ఫ్రెండ్లీ అనుభవాలను అందించనుండటంతో పాటుగా ఇతర ఉత్పత్తులు సైతం అందుబాటులో ఉంటాయి’’ అని అన్నారు. ఈ కార్యక్రమ టిక్కెట్లు బుక్‌ మై షో వద్ద లభ్యమవుతాయి. ఈ షో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ డిసెంబర్‌ 18, 2022న జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది మృతి?